పలాస జీడి పప్పునకు ‘జాతీయ అవార్డు’
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:04 AM
శ్రీకాకుళం జిల్లా ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా చాటి చెబుతూ పలాస జీడిపప్పు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కింద ఉత్తమ ఉత్పత్తిగా ఎంపికై జాతీయ అవార్డును పొందింది.
శ్రీకాకుళం, జూలై 14(ఆంధ్రజ్యోతి) : శ్రీకాకుళం జిల్లా ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా చాటి చెబుతూ పలాస జీడిపప్పు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కింద ఉత్తమ ఉత్పత్తిగా ఎంపికై జాతీయ అవార్డును పొందింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఈ అవార్డును కేంద్ర పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, కేంద్ర వస్త్రోత్పత్తుల మంత్రి జితిన్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవితల చేతుల మీదుగా అందుకు న్నారు. జిల్లా ఉద్యానవన అధికారి ప్రసాదరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ‘తితలీ తుఫాన్ తీవ్రంగా నష్టపరిచినా.. అదే ఓ మలుపుగా మారింది. పునరుద్ధరణ చర్యలు, అధిక దిగుబడినిచ్చే జాతుల ప్రోత్సాహం. ఉపాధి హామీ పథకం విని యోగంతో సాగు విస్తరించింది. జీడిపప్పు ప్రాసె సింగ్ పరిశ్రమలకు కొత్త దిశ చూపగలిగాం. ఇది రైతుల కృషికి, అధికార యంత్రాంగ ప్రణాళికా బద్ధ మైన కార్యాచరణకు లభించిన గుర్తింపు’ అని పేర్కొన్నారు.
మంత్రి అచ్చెన్న అభినందన..
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా స్పందిస్తూ.. ‘రైతుల సంకల్పం, అధి కారుల కృషి కలిసి ఓ గొప్ప విజయాన్ని సాధిం చాయి. ఇది రాష్ట్ర ఉద్యాన రంగానికే మైలురాయిగా నిలుస్తుంది’ అని ప్రశంసించారు.