Share News

పలాస జీడి పప్పునకు పేటెంట్‌ సాధించాలి

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:01 AM

: పలాస జీడి పప్పు అరకు కాఫీ వలె పేటెంట్‌ హక్కు సాధించాలని ఎమ్మెల్యే గౌతుశిరీష కోరారు. మంగ ళవారం స్థానిక టీడీపీ కార్యాలయం లోజీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం ప్రధానకార్యదర్శి,జిల్లాటీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు టంకాల రవిశం కర్‌గుప్తా అధ్యక్షతన మనపిక్క-మన బాధ్యతపై సదస్సు నిర్వహించారు.

పలాస జీడి పప్పునకు పేటెంట్‌ సాధించాలి
మాట్లాడుతున ్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, అక్టోబరు 21(ఆంధ్రజ్యో తి): పలాస జీడి పప్పు అరకు కాఫీ వలె పేటెంట్‌ హక్కు సాధించాలని ఎమ్మెల్యే గౌతుశిరీష కోరారు. మంగ ళవారం స్థానిక టీడీపీ కార్యాలయం లోజీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం ప్రధానకార్యదర్శి,జిల్లాటీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు టంకాల రవిశం కర్‌గుప్తా అధ్యక్షతన మనపిక్క-మన బాధ్యతపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడు తూ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సహకారంతో ఇప్పటికే పలాసలో కేంద్రీయ విద్యాలయం రప్పించుకున్నామని, జీడి బోర్డుకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని,తొందరలోనే పలాసలో కొత్త పారిశ్రా మికవాడలో వ్యాపారులకు స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ప్రజలు దీవిస్తే పలాసను రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యత గౌతు కుటుంబానిదని భరోసా ఇచ్చారు. పలాస టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి మాట్లాడుతూ పలాస జీడి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి సంయుక్తంగా కృషి చేయాలని, మన పిక్క-మన బాధ్యత కార్యక్రమం ద్వారా 2035 నాటికి పలాస జీడిపప్పు అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు సాధించాలని పిలుపునిచ్చారు. కొత్త జీడి వం గడాల ద్వారా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని, దీన్ని రైతుల్లో విస్తృ తంగా ప్రచారాలుచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌, పీసీఎంఏ(పారిశ్రామికవాడ) అధ్యక్షుడు మల్లా రామేశ్వ రరావు, ఆలిండియా క్యాజూ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మల్లా కాంతారావు, జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శాసనపురి మురళీకృష్ణ, కార్మికసంఘ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి, బ్యాంకర్లు, ఉద్యానవనశాఖ అధికారులు, సైంటిస్ట్‌లు, ఏపీ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరావుయాదవ్‌, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, దువ్వాడ శ్రీకాంత్‌, సప్ప నవీన్‌, సూరాడ మోహనరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 12:01 AM