Share News

నాసిరకం మందుల తయారీ కంపెనీ యజమానికి జైలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:15 AM

నాసిరకం మందుల తయారు చేస్తున్న కంపెనీ యజమాని మనోజ్‌కుమార్‌ రాంబల్‌కు ఒక రోజు జైలు, రూ.50వేలు జరీమానాను విధిస్తూ శ్రీకాకుళం అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కేఎం జమృత్‌ బేగమ్‌ తీర్పునిచ్చారు.

నాసిరకం మందుల తయారీ కంపెనీ యజమానికి  జైలు

శ్రీకాకుళం, జూలై 29(ఆంధ్రజ్యోతి): నాసిరకం మందుల తయారు చేస్తున్న కంపెనీ యజమాని మనోజ్‌కుమార్‌ రాంబల్‌కు ఒక రోజు జైలు, రూ.50వేలు జరీమానాను విధిస్తూ శ్రీకాకుళం అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కేఎం జమృత్‌ బేగమ్‌ తీర్పునిచ్చారు. జిల్లా ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు చంద్రరావు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళంలో 2017 అక్టోబ రు 10న ఓ మందుల దుకాణంలో విటమిన్‌-ఏ పీడీయాట్రిక్‌ ఓరల్‌ సొల్యూషన్‌ (చిన్నపిల్లలకు నోటిలో వేసే మందు)ను నమూనాలను జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఆ ఓరల్‌ సొల్యూ షన్‌లో ప్రామాణికాలు లోపించాయని నిర్ధారణ అయింది. దీంతో ఈ మందు తయారు చేసిన కంపెనీ సన్‌రైజ్‌ ఇంటర్‌నేషనల్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌ యజమాని మనోజ్‌కుమార్‌ రాంబల్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. సీనియర్‌ ఏపీపీ పి.సుశీల కోర్టులో వాదనలు వినిపించా రు. ఈ మేరకు ముద్దాయి మనోజ్‌కుమార్‌ రాంబల్‌ తన నేరాన్ని అంగీకరించారు. జిల్లా వ్యాప్తంగా తరచూ మందుల నమూనాలను సేకరిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు చంద్రరావు అన్నారు. ఔషధ చట్టం ఉల్లంఘనలపై జిల్లాలో 44 కేసులు నమోదు చేశామని, కోర్టుల్లో విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు.

Updated Date - Jul 30 , 2025 | 12:15 AM