Share News

మాది రైతు ప్రభుత్వం: ఎమ్మెల్యే శిరీష

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:11 AM

అన్నదాతల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రైతు ప్రభుత్వంగా గుర్తింపు పొందామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

మాది రైతు ప్రభుత్వం: ఎమ్మెల్యే శిరీష
మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిరీష

పలాసరూరల్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): అన్నదాతల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రైతు ప్రభుత్వంగా గుర్తింపు పొందామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. రెంటికోటలో మంగళవారం ఽధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. చివరి ధాన్యం వరకూ ప్రభుత్వం కొను గోలు చేస్తుందన్నారు. గ్రామంలోని కోనేరును బాగు చేయాలని రెంటికోట గ్రామస్థులు కోరడంతో ఆమె ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కోనేరు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావుయాదవ్‌, వ్యవసాయ ఏడీ రామారావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ వంకల కూర్మారావు, తహసీల్దార్‌ కళ్యాణచక్రవర్తి, నాయకులు దువ్వాడ సంతోష్‌, గురిటి సూర్యనారాయణ, గంగారామ్‌, సర్పంచ్‌ ఎస్‌.మోహన రావు, హరియా మోహనరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:11 AM