Share News

organ donation: వివాహ వేదిక సాక్షిగా..

ABN , Publish Date - May 16 , 2025 | 12:04 AM

Couple's .. Organ Donor Awareness తాళికట్టు శుభవేళ.. ఆ నవ దంపతులు సమాజంలో నలుగురికీ ఆదర్శంగా ఉండేలా ఓ నిర్ణయం తీసుకున్నారు. తమ మరణానంతరం అవయవ దానానికి అంగీకరిస్తున్నట్టు వివాహ వేదిక సాక్షిగా ప్రకటించారు.

organ donation: వివాహ వేదిక సాక్షిగా..
అంగీకార పత్రాలను అందజేస్తున్న నవ దంపతులు శ్రీనివాసనాయుడు, ప్రియాంక, వారి బంధువులు, స్నేహితులు

  • అవయవ దానానికి నవదంపతుల అంగీకారం

  • వీరి బాటలో మరో 60 మంది ముందుకు...

  • ఎచ్చెర్ల, మే 15(ఆంధ్రజ్యోతి): తాళికట్టు శుభవేళ.. ఆ నవ దంపతులు సమాజంలో నలుగురికీ ఆదర్శంగా ఉండేలా ఓ నిర్ణయం తీసుకున్నారు. తమ మరణానంతరం అవయవ దానానికి అంగీకరిస్తున్నట్టు వివాహ వేదిక సాక్షిగా ప్రకటించారు. అంతేకాదు... మరికొంత మంది ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేలా స్ఫూర్తినింపారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా పత్తికాయవలస గ్రామానికి చెందిన బాలి శ్రీనివాసులు నాయుడుకు, శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన ప్రియాంకతో ఎచ్చెర్ల మండలం మెట్టపేటకు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో గురువారం వివాహం జరిగింది. ఈ పెళ్లి వేదిక నుంచే నూతన దంపతులతో పాటు వారి స్నేహితులు, బంధువులు 60 మంది ముందుకువచ్చి అవయవ దానానికి అంగీకరించారు. ఈమేరకు విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మానవీయతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బీవీ గోవిందరాజులుకు అంగీకార పత్రాలను అందించారు.

Updated Date - May 16 , 2025 | 12:04 AM