ఓపీఎస్ అమలుచేయాలి
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:01 AM
పాత పింఛన్ విధానం అమలుచేయాలని(ఓపీఎస్) డీఎస్సీ-2003 ఉపాఽధ్యా యులు డిమాండ్‌చేశారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ కార్యాలయాల వద్ద వివిఽధ ఆయా ఉపాధ్యాయ సంఘ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
పాత పింఛన్ విధానం అమలుచేయాలని(ఓపీఎస్) డీఎస్సీ-2003 ఉపాఽధ్యా యులు డిమాండ్‌చేశారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ కార్యాలయాల వద్ద వివిఽధ ఆయా ఉపాధ్యాయ సంఘ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
ఫగుజరాతీపేట, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని తహసీల్దార్ కార్యాలయంలో వద్ద డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు మెమో-57ను అమలు చేయడం ద్వారా పాతపెన్షన్ విధానాన్ని వర్తింపుజేయాలని డీఎస్సీ-2003 ఫో రం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.అలాగే జిల్లాలోని ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించా లని నల్లబ్యాడ్జీలతో పాఠశాలలకు హాజరయ్యారు.
ఫ ఆమదాలవలస, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):2003 డీఎస్సీ ఉపాధ్యా యులు, పోలీసులు గ్రూప్-1, 2 ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని పునరు ద్దరించాలని డీఎస్సీ-2003 ఉపాధ్యాయుల ఫోరం డిమాండ్ చేసింది.స్థానిక తాలూకా కేంద్రంలో ఉపాధ్యాయులు, సంఘ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ రాంబాబుకు వినతిప త్రం అందజేశారు.
ఫసరుబుజ్జిలి, సెప్టెంబరు 11 (ఆంధ్ర జ్యోతి): ఉపాధ్యాయుల సమస్య లను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ మండలాధ్యక్షుడు రామన్న డిమాండ్ చేశారు. రొట్టవలసఉన్నతపాఠశాల ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఫ పొందూరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఉన్నతపాఠశాల ఆవరణలో పెండింగ్‌లో ఉన్న విద్య, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించా లని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.