నిబద్ధత కలిగిన నాయకులకు అవకాశం
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:01 AM
పార్టీ కోసం నిబ ద్ధతతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించేందుకు ఆలిం డియా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని ఏఐసీసీ కార్యదర్శి సూరత్‌సింగ్ ఠాకూర్ అన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి సూరత్‌సింగ్ ఠాకూర్
అరసవల్లి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం నిబ ద్ధతతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించేందుకు ఆలిం డియా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని ఏఐసీసీ కార్యదర్శి సూరత్‌సింగ్ ఠాకూర్ అన్నారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆలోచన లను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. జిల్లా కాంగ్రెస్ పదవికి ఇప్పటికే దర ఖాస్తులు అందాయని, ఈనెల 27 వరకు అన్ని నియోజక వర్గాల్లో పర్యటించి స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వ హిస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గం నుంచి అభిప్రాయ సేక రణ చేసి, వాటిని కాంగ్రెస్ అఽధినేత రాహుల్ గాంధీకి నివేది స్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ కమిటీ సభ్యులు ఎల్. రామారావు, పి.శాంతికుమారి. నేతలు రెల్ల సురేష్, అంబటి కృష్ణారావు, సనపల అన్నాజీరావు, బస్వా షణ్ముఖరావు, చక్ర వర్తిరెడ్డి, పూడి కిరణ్‌కుమార్, గోవింద మల్లిబాబు, కేవీఎల్ ఎస్‌ఈశ్వరి, మంత్రి నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.