ఆదిత్యుని ఆలయంలో ఆన్‌లైన్ సేవలు
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:33 PM
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనం, సేవలు, ప్రసాదాలు, అద్దె రూమ్‌ల కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఈవో కేఎన్‌వీడీవీ పసాద్ ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు ఆదిత్య ఆలయం ఆవరణలో మనమిత్ర వాట్సాప్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈ యాప్ ద్వారా సెల్‌ఫోన్ ద్వారా రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాల్లో సేవలను పొందేందుకు ముందుగానే రిజర్వ్ చేసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా ఉంటుందని తెలిపారు. తొలిరోజునే 1000 మంది భక్తులు ఈ యాప్‌ను వినియోగించుకోవడం విశేషం
అరసవల్లి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనం, సేవలు, ప్రసాదాలు, అద్దె రూమ్‌ల కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఈవో కేఎన్‌వీడీవీ పసాద్ ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు ఆదిత్య ఆలయం ఆవరణలో మనమిత్ర వాట్సాప్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈ యాప్ ద్వారా సెల్‌ఫోన్ ద్వారా రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాల్లో సేవలను పొందేందుకు ముందుగానే రిజర్వ్ చేసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా ఉంటుందని తెలిపారు. తొలిరోజునే 1000 మంది భక్తులు ఈ యాప్‌ను వినియోగించుకోవడం విశేషం.
ఆదాయం రూ.4.35 లక్షలు
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆదివారం ఒక్క రోజు రూ.4.35,677ల ఆదాయం లభించింది. ఇందు లో టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.2,25,700లు, విరాళాల రూపంలో రూ.54,122లు, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,55,855లు లభించాయి. ఆదిత్యుని దక్షిణ భారత చలన చిత్ర నటి, శాస్త్రీయ నృత్యకారిణి జయలలిత, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి స్వాతీ సోమనాథ్ దర్శించు కున్నారు.వారికి ఆలయ ప్రధానార్చకులు స్వాగతం పలు కగా అర్చకుల వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి వారి ప్రసాదాలు, జ్ఞాపికను ఈవో వారికి అందజేశారు.
శ్రీకూర్మనాధుడి సన్నిధిలో పూజలు
గార, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ శ్రీకూర్మ నాధుని ఆదివారం శాంతా బయోటిక్ అధినేత పద్మ విభూషన్ డాక్టర్‌వరప్రసాదరెడ్డి దర్శించుకున్నారు. వీరితో పాటు ఎన్నారై తోటకూర ప్రసాద్, కళాసుధ శ్రీనివాస్, సంప్రదాయంగురుకులం డైరెక్టర్ స్వాతిసోమనాఽథ్, పి. సుగుణాకరరావు దర్శించుకున్నారు.వీరు స్వామి సన్నిధిలో గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం స్వామివారి ప్రసాదం, చిత్ర పటాన్ని ఆలయఈవో టి.వాసుదేవరావుకు అందించారు.