కొనసాగుతున్న ‘రైతన్నా మీకోసం’
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:13 AM
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గురువారం ఎమ్మెల్యేలు పాల్గొని రైతులకు పథకాలను వివరించారు.
రైతు సంక్షేమమే ధ్యేయం: శంకర్
గార, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. వాడాడ గ్రామంలో గురువారం ‘రైతన్నా మీకోసం’ కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం చంద్ర బాబు సందేశంతో రూపొందించిన కరపత్రాలను రైతు లకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల కు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని వాటిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో తహ సీల్దార్ చక్రవర్తి, ఎంపీడీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: అశోక్
సోంపేట రూరల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రైతుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా గురువారం మామిడిపల్లిలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి రైతులకు అమలు చేస్తున్న పథకాలను వివరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వ ర్ణాంధ్ర-2047 సాధనలో రైతు తలసరి ఆదాయం రూ.55 లక్షలు లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికా రులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మడ్డు కుమార్, నేతలు సూరాడ చంద్రమోహన్, విజయలక్ష్మి, నాగేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు బిన్నాల జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
‘రైతన్నా మీకోసం’లో అదనపు డైరెక్టర్
శ్రీకాకుళం రూరల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్ మండలం చాపురం, గూడెం గ్రామా ల్లో గురువారం నిర్వహించిన ‘రైతన్నా మీకోసం’ కార్య క్రమంలో గుంటూరు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యా లయం అదనపు డైరెక్టర్ వీవీ విజయలక్ష్మి పరిశీ లిం చారు. ఈ సందర్భంగా రైతులకు అందించే ఐదు కార్యాచరణ విధానాలు, ఫార్మర్ యాప్ వినియోగం, వ్యవ సాయ యాంత్రీకరణ సర్వే, మట్టి నమూనాలు పత్రాలు పంపిణీ తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమం లో జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ సీహెచ్ వెంకటరావు, సబ్ డివిజన్ ఏడీఏ బి.రజని, రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా.పి.ఉదయబాబు, ఏవో పి.నవీన్ తదితరులు పాల్గొన్నారు.
అదనంగా ధాన్యం తీసుకుంటే చర్యలు: బగ్గు
జలుమూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి మిల్లర్లు అదనంగా ధాన్యం తీసుకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. కూర్మనాథపురంలో గురువారం రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించారు. మిల్లర్లు అదనంగా ఐదారు కిలోల ధాన్యం వసూలు చేస్తుండడం దారుణమన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం సహించేది లేదన్నారు. సమావేశంలో ఏడీఏ ఎల్‌వీ మధు, ఎంపీడీవో బి.చిన్నమ్మడు, ఏవో కె.రవికుమార్, ఉద్యానవన అధికారి కత్తిరి సునీత, టీడీపీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, బగ్గు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
యాత్రీకరణ వైపు దృష్టి: ఎంజీఆర్
మెళియాపుట్టి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): యాత్రీ కరణ వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. గురువారం మర్రిపాడు, సి.జలగలింగుపురం గ్రామాల్లో రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అంతర పంటల సాగుపై ఆసక్తి చూపాలని సూచించారు. కార్యక్ర మంలో తహసీల్దార్ బి.పాపారావు, ఎంపీ డీవో ప్రసాద్‌పండా, టీడీపీ నాయకులు ఎస్.మోహన రావు, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.