Dsc candidates : కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:12 PM
Verification of certificates of DSC candidates మెగా డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం కూడా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 543 మంది అభ్యర్థులకుగానూ శ్రీకాకుళం మహాలక్ష్మినగర్‌లో సమగ్రశిక్ష ఎఫ్.ఎల్.ఎన్ శిక్షణ కార్యాలయంలో గురువారం 403 మంది ధ్రువపత్రాలను పరిశీలించారు.
ఇంకా ఏడుగురి డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాలు పెండింగ్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం కూడా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 543 మంది అభ్యర్థులకుగానూ శ్రీకాకుళం మహాలక్ష్మినగర్‌లో సమగ్రశిక్ష ఎఫ్.ఎల్.ఎన్ శిక్షణ కార్యాలయంలో గురువారం 403 మంది ధ్రువపత్రాలను పరిశీలించారు. అందులో 13 మంది సరైన ధ్రువపత్రాలు సమర్పించలేదు. దీంతో వారికి శుక్రవారం అవకాశం కల్పించారు. వారితో మిగిలిన 140 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను కూడా అధికారులు పరిశీలించారు. కాగా.. శుక్రవారం ఏడుగురు అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలు సమర్పించలేదు. దీంతో అధికారులు వారికి మరో అవకాశం కల్పిస్తూ శనివారం ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. ముందుగా అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాలను సమర్పిస్తే.. వాటిని పరిశీలించి, వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. సిబ్బంది సహకారంతో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని డీఈవో రవిబాబు తెలిపారు.