Share News

చికిత్సపొందుతూ ఒకరి మృతి

ABN , Publish Date - May 28 , 2025 | 12:08 AM

కాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు.

 చికిత్సపొందుతూ ఒకరి మృతి

గార, మే 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. ఏఎస్‌ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని వత్సవలస దగ్గరలో ఈనెల 22న ఎండ మోహనరావు (47) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు చికిత్సకోసం రిమ్స్‌ చేరగాలో సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. రిమ్స్‌ ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశారు.

లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి..

కవిటి, మే 27(ఆంధ్రజ్యోతి): కొజ్జిరియా జంక్షన్‌లో జాతీయ రహదా రిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు. చీకటి బలరాంపురం నుంచి నడుచుకొని వస్తుండగా ట్రాలర్‌ లారీ ఢీకొనడంతో 45 నుంచి 50 సంవ త్సరాల వయసు ఉన్న వ్యక్తి తలకు దెబ్బతగలడంతో మృతి చెందాడని చెప్పారు. మృతుడు తెలుపురంగు షర్డు, నలుపురంగు జీన్‌ఫ్యాంట్‌ వేసు కొని ఉన్నాడన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు కవిటి పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.

Updated Date - May 28 , 2025 | 12:08 AM