Share News

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:53 PM

మేజర్‌ పంచాయ తీ టెక్కలి పెద్దబ్రాహ్మణవీధికి చెందిన బిసాయి లక్ష్మణ్‌ (36) ఆదివారం మధ్యాహ్నం విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

టెక్కలి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మేజర్‌ పంచాయ తీ టెక్కలి పెద్దబ్రాహ్మణవీధికి చెందిన బిసాయి లక్ష్మణ్‌ (36) ఆదివారం మధ్యాహ్నం విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేర కు.. బిసాయి నివాసం ఉంటున్న ఇంట్లోని విద్యుత్‌ వైర్లు వేలాడి ఉండడంతో వాటిని సరిదిద్దే క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న బిసాయికి వైద్యులు సీపీఆర్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు నుంచి జారిపడి యువకుడు..

కంచిలి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి చెందిన లోపింటి ఆనందరావు(39) శనివారం రాత్రి రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందినట్టు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. ఆనందరావు విశాఖలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చెన్నై హౌరా మెయిల్‌లో స్వగ్రామానికి వస్తుండగా స్టేషన్‌ సమీపంలో ప్రమాదానికి గురై మృతి చెందినట్లు విచారణలో తేలినట్టు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఆనంద రావుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోంపేట రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Updated Date - Nov 23 , 2025 | 11:53 PM