విద్యుత్ స్తంభం పడి ఒకరి మృతి
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:56 PM
రెల్లివలస గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు వేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు బాణాల రాము (37) అక్కడక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయప డ్డాడు.
నరసన్నపేట, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రెల్లివలస గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు వేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు బాణాల రాము (37) అక్కడక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయప డ్డాడు. ఉర్లాం సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలు వేసేందుకు ట్రాక్టరుపై నుంచి దించే సమయంలో ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీంతో తోటి కార్మికుల చేతుల్లో ఉన్న స్తంభం జారిపోయి కిందన ఉన్న నడగాం గ్రామానికి చెందిన రాముపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అదే గ్రామానికి చెందిన జోగి రాంబాబు గాయాలతో బయటపడ్డారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ దుర్గాప్రసాద్.. రాము భార్య ఢిల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.