Share News

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:08 AM

నౌపడా-మెళియాపుట్టి రోడ్డులో తలగాం జంక్షన్‌ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెం దారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

టెక్కలి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): నౌపడా-మెళియాపుట్టి రోడ్డులో తలగాం జంక్షన్‌ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెం దారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజగోపాల పురం గ్రామానికి చెందిన ఇజ్జువరపు అప్పన్న(45) తలగాం జంక్షన్‌ వైపు నడిచి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్క డికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పన్నకు భార్య పార్వతి, కుమారుడు కార్తీక్‌ఉన్నారు.

యువకుడి ఆత్మహత్య

నందిగాం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): దేవుపురం పంచా యతీ తురకలకోట గ్రామానికి చెందిన మేఘవరం వెంక ట్రావు(33) శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకట్రావు వజ్ర పుకొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో గల ఓ పెట్రో ల్‌ బంకులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బంకు యజ మాని వద్ద రూ.30వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చమని ఆ బంకు యజమాని పదేపదే అడుగుతుండడంతో మనస్తాపానికి గురై వెంకట్రావు గ్రామ సమీపంలోని తోటలోని మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకట్రావు భార్య నీలవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామన్నారు. వెంకట్రావుకి భార్యతో పాటు కుమార్తె, తల్లి, సోదరులు ఉన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 12:08 AM