కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా లక్ష సంతకాలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:03 AM
పలాస నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా లక్ష సంతకాలను సేకరిస్తున్నట్టు ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు.
పలాస, జూన్ 9(ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా లక్ష సంతకాలను సేకరిస్తున్నట్టు ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు కాశీబుగ్గలోని ప్రైవేటుకల్యాణ మండపంలో వివిధ ప్రజా సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐఎంల్ న్యూడె మోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబ రేషన్ నాయకుడు మద్దిల రామారావు, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు మాట్లాడారు. కార్గో ఎయిర్‌పోర్టుకు బలవంతంగా భూములు ఎందుకు సేకరిస్తున్నారో కేంద్ర మంత్రి రామ్మో హన్‌నాయుడు ప్రజలకు సమాధానం చెప్పా లన్నారు. పర్యావరణ దినోత్సవం నాడు కేంద్ర మంత్రి మొక్కలు నాటుతూ.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి గాను లక్షలాది మొక్కలు ధ్వంసం చేసేందుకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. జిల్లా ప్రజలెవరైనా ఎయిర్ పోర్టు కావా లని అడిగారా, ఎవరి ప్రయోజనాల కోసం దీనిని చేపడుతున్నారని ప్రశ్నించారు. జీడికి గిట్టు బాటు ధర కల్పించాలని, పలాస నుంచి ఇతర ప్రాంతాలకు రైళ్లు వేయాలని ఈ సంద ర్భంగా డిమాండ్ చేశారు. సమావేశంలో పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, జోగి అప్పా రావు, ఎన్.గణపతి, తెప్పల అజయ్‌కుమార్, కొర్ల హేమారావుచౌదరి తదితరులు పాల్గొన్నారు.