Share News

ఓం మహాప్రాణ దీపం.. శివం శివం

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:20 AM

Devotees to temples కార్తీకమాస మూడో సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీకాకుళంలో నాగావళి నదీ తీరాన సోమవారం వేకువజామున అధిక సంఖ్యలో మహిళలు దీపాలు వెలిగించి విడిచిపెట్టారు.

ఓం మహాప్రాణ దీపం.. శివం శివం
నాగావళి నది తీరాన దీపారాధన చేస్తున్న మహిళలు

మూడో సోమవారం ఆలయాలకు పోటెత్తిన భక్తులు

నాగావళి నదీతీరాన దీపకాంతులు

అరసవల్లి, టెక్కలి, టెక్కలి రూరల్‌, జలుమూరు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కార్తీకమాస మూడో సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీకాకుళంలో నాగావళి నదీ తీరాన సోమవారం వేకువజామున అధిక సంఖ్యలో మహిళలు దీపాలు వెలిగించి విడిచిపెట్టారు. అనంతరం ఉమారుద్రకోటేశ్వరుడ్ని దర్శించుకుని పూజలు చేశారు. టెక్కలి మండలం రావివలసలో ఎండలమల్లన్న ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. ఎటుచూసినా భక్త జనం కనిపించింది. గత శనివారం కాశీబుగ్గలో ని వెంకటేశ్వరాలయంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు రావివలస చేరుకునేందుకు విశాలమైన మార్గాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా సేవలు అందించారు. జలుమూరు మండలంలో శ్రీముఖలింగం.. భక్తులతో కిటకిటలాడింది. వంశధార నదీ తీరంలో భలక్తులు స్నానాలు ఆచరించి.. దీపారాధనలు చేశారు. అనంతరం శ్రీముఖలింగేశ్వరుడ్ని దర్శించుకుని పూజలు చేశారు. సోమేశ్వర, భీమేశ్వరాలయాల్లో కూడా పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు.

Updated Date - Nov 11 , 2025 | 12:20 AM