Share News

misbehavior బాలికపై వృద్ధుడి వికృత చేష్టలు

ABN , Publish Date - Mar 17 , 2025 | 11:43 PM

misbehavior ఆరేళ్ల బాలిక పై ఓ వృద్ధుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా చిన్నారికి చాక్లె ట్లు, బిస్కెట్లు ఆశచూపి బలాత్కారానికి ప్రయత్నించాడు. ఆ బాలిక వృద్ధుడి చేతిలో బలికాకుండా తల్లి చొరవతో క్షేమంగా బయటపడింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించగా వృద్ధుడిపై రెండో పట్టణ పోలీసులు పోక్సో కేసు చేశారు.

misbehavior   బాలికపై వృద్ధుడి వికృత చేష్టలు

చాక్లెట్‌ ఆశ చూపి అసభ్య ప్రవర్తన

పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు

శ్రీకాకుళం క్రైమ్‌/గుజరాతీపేట: మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల బాలిక పై ఓ వృద్ధుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా చిన్నారికి చాక్లె ట్లు, బిస్కెట్లు ఆశచూపి బలాత్కారానికి ప్రయత్నించాడు. ఆ బాలిక వృద్ధుడి చేతిలో బలికాకుండా తల్లి చొరవతో క్షేమంగా బయటపడింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించగా వృద్ధుడిపై రెండో పట్టణ పోలీసులు పోక్సో కేసు చేశారు. ఈ ఘటన శ్రీకాకుళంలో కలకలం రేపింది. టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ ఓ వ్యక్తి కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య అపార్ట్‌మెంట్‌లో ఇంటి పనులు చేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. మరో అపార్ట్‌మెంట్‌లో హిందూస్థాన్‌ ఏరో నాటిక్స్‌లో లెక్చరర్‌గా పనిచేసి 2006లో రిటైరైన 80 ఏళ్ల కనిమెట్ట నర్సింహాచార్యులు నివసిస్తున్నాడు. ఆయన సదరు వ్యక్తి పెద్ద కుమార్తె (ఆరేళ్ల బాలిక)పై కన్నేశాడు. తరచూ చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. శనివారం సాయంత్రం తన చెల్లితో ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్లు ఆశ చూపి అపార్ట్‌మెంట్‌ కారు పార్కింగ్‌ ప్రాంతానికి తీసుకువెళ్లి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అదే సమయంలో అపార్ట్‌మెంట్‌లో పనులు ముగించుకుని అటుగా వచ్చిన బాలిక తల్లి నర్సింహాచార్యులు చేష్టలను గమనించింది. దీంతో అక్కడకు చేరుకున్న ఆమె ఆయనను మందలించింది. ఆయన నుంచి బాలికను విడిపించి ఇంటికి తీసుకు వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీసింది. భర్తకు జరిగిన ఘటనను భార్య తెలిపింది. ఈ మేరకు తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీసులను సోమవారం ఆశ్రయించారు. ఈ ఫిర్యాదును టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు స్వీకరించి శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, ఎస్పీ మహేశ్వరరెడ్డికి తెలియ జేశారు. ఎస్పీ ఆదేశాలతో బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సంతోష్‌.. నర్సింహాచార్యులపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను విచా రించారు. తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు పాల్ప డిన నర్సింహాచార్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - Mar 17 , 2025 | 11:43 PM