Share News

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:12 AM

బెలమర గ్రామంలో వృద్ధు రాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

పోలాకి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): బెలమర గ్రామంలో వృద్ధు రాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల తెలిపిన వివరా ల మేరకు.. గ్రామానికి చెందిన దండుపాటి అప్పన్నమ్మ అలియాస్‌ బోడెమ్మ (68) కొన్నేళ్లుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంది. బోడె మ్మ భర్త చనిపోయాడు. వీరికి కు మారుడు వెంకటరమణ ఉన్నాడు. బోడెమ్మ బెలమరలోని కుమారుడి ఇంటి ఎదురుగానే నివాసం ఉంటుంది. ఇది లావుంటే బోడెమ్మ కాలికి, మెడకు గాయాలు ఉన్నాయి. దీంతో ఈమె మృతిపై స్థానికంగా పలు అనుమానాలు వ్య క్తమవుతున్నాయి. కోడలు అనురాధ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రంజిత్‌ అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీం పరిశీలించి ఆధారాలు సేక రించారు. ఘటనా స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రంజిత్‌ పరిశీలించారు.

గంజాయితో ముగ్గురి అరెస్టు

నరసన్నపేట, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): గంజాయితో ముగ్గురిని అరె స్టు చేసినట్టు సీఐ ఎం.శ్రీని వాసరావు తెలిపారు. బుధ వారం ఆయన తెలిపిన వి వరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం బాలాసూర్‌ జిల్లా అనంతపూర్‌ గ్రామానికి చెందిన ముక్తిరంజన్‌ మల్లిక్‌, చిత్తూరు జిల్లా మదనాపురం గ్రామానికి చెందిన జల్లి శివకుమార్‌, ఆషారాణిదాస్‌ 10.4 కిలోల గంజాయితో వెళ్తుండగా.. మడపాం టోల్‌గేటు వద్ద ఎస్‌ఐ-2 శేఖరరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. వీరు ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. ఒడిశాకు చెందిన ముక్తిరంజన్‌ మల్లిక్‌ బెంగుళూరు తరలిస్తుండగా, చిత్తూరుకు చెందిన జల్లి శివకుమార్‌, ఆషారాణిదాసు హైదరాబాదు తరలిస్తుండగా పట్టుబడినట్లు ఆయన తెలిపారు. వీరిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచినట్టు తెలిపారు.

Updated Date - Dec 11 , 2025 | 12:12 AM