పీఏసీఎస్ స్థల ఆక్రమణపై అధికారుల సర్వే
ABN , Publish Date - May 17 , 2025 | 12:19 AM
పొందూరు పీఏసీఎస్ స్థల ఆక్రమణపై శుక్రవా రం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.
పొందూరు, మే 16(ఆంధ్రజ్యోతి): పొందూరు పీఏసీఎస్ స్థల ఆక్రమణపై శుక్రవా రం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. పొందూరు పీఏసీఎస్‌కు పొందూరు మేజరు పంచాయతీ పరిధి జోగన్నపేట గ్రామం వద్ద 23.5 సెంట్ల స్థలం ఉంది. స్థలా నికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు పీఏసీఎస్ యాజమాన్యం వద్ద ఉన్నాయి. ఈ స్థలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 8 సెంట్లు స్థలం ఆక్రమించారు. ఇక్కడ సెంటు స్థలం రూ.7 నుంచి రూ.8 లక్షలు ఉంటుంది. ఇటీవల మండల పరిషత్ సమావేశంలో ఆక్రమణపై ఎమ్మెల్యే రవికుమార్ దృష్టికి తీసుకువచ్చారు. రవికుమార్ స్పందిస్తూ తక్షణమే ఆక్రమణ స్థలంలో ఉన్న అరటి చెట్లను తొలగించి స్థలాన్ని పీఏసీ ఎస్‌కు అప్పగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అవసరమైతే పోలీసు భద్రత తీసుకోవాలని పీఏసీఎస్ సీఈవో పాపినా యుడును ఆదేశించారు. సర్వే నిర్వహించి ఆక్రమణ స్థలం పీఏసీఎస్‌కు చెందినదని గుర్తించి తహసీల్దార్‌కు నివేదిక ఇచ్చారు. ఈ సర్వేపై ఎమ్మెల్యే రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేచేసి ఆక్రమ ణ స్థలాన్ని స్వాధీనం ఎందుకు చేసుకోలేదని రెవెన్యూ, పీఏసీఎస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సర్వేలో సర్వేయర్ గణపతి, ప్రసాద్, శ్రావ్య, పీఏసీఎస్ సీవో పాపినాయుడు తదితరులు ఉన్నారు. పొందూరు పట్టణం పరిధిలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. కాగా ఇటీవల 198, 241, 6-3, 173 సర్వే నంబర్లలో విలువైన శాలిహుండం ట్రస్టు భూముల ఆక్రమణపైనా ట్రస్టు చైర్మన్ మధురెడ్డి ఎమ్మెల్యే రవికుమార్, రెవెన్యూ, దేవదాయ, పోలీసులకు ఫిర్యాదు చేశారు.