అక్రమ లే అవుట్‌ను పరిశీలించిన అధికారులు
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:23 AM
మండలం లోని ఇజ్ఞవరం పంచాయితీలో నౌపడ రైల్వే గేట్ సమీపంలో టెక్కలి-నౌపడ మొయిన్‌రోడ్డులో సర్వే నెంబర్లు 355-1ఈ, 355-1ఎఫ్‌లో వేసిన అక్రమ లేఅవుట్‌ను సుడా అధికారులు శుక్రవారం పరిశీలించారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
సంతబొమ్మాళి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మండలం లోని ఇజ్ఞవరం పంచాయితీలో నౌపడ రైల్వే గేట్ సమీపంలో టెక్కలి-నౌపడ మొయిన్‌రోడ్డులో సర్వే నెంబర్లు 355-1ఈ, 355-1ఎఫ్‌లో వేసిన అక్రమ లేఅవుట్‌ను సుడా అధికారులు శుక్రవారం పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే మనవుడినంటూ అను తమతులు లేకుండా అక్రమ లే అవుట్ వేయ డమే కా కుండా వంశధార పిల్ల కాలువ, కల్వ ర్టును కప్పేయ డంపై బుధ వా రం ‘ఆంధ్ర జ్యోతి’లో ‘వం శధార కాలువ కబ్జా’ అనే శీర్షికతో ప్రచురించిన కథనంపై సుడా అధికారులు స్పందించారు. సుడా ప్లానింగ్ అధికారి వెంకటేష్ అక్రమ లేఅవుట్‌ను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి ఉమాపతి నుంచి వివరాలు సేకరించారు. అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ ను సోమవారంలోగా తొలగిస్తామని సంబంధిత యాజమాని తెలిపారని ప్లానింగ్ అధికారి వెంకటేష్ తెలిపారు. గడువులోగా తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కోటబొమ్మాళిలో...
కోటబొమ్మాళి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలను కొందరు ఆక్రమించుకున్నారని... వారి నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి పలువురు ఫిర్యాదులు చేయడంతో అక్కడి అధికారుల ఆదేశాల మేరకు టెక్కలి ఆర్‌డీవో ఎన్.కృష్ణమూర్తి స్పందించారు. తహసీల్దార్ అప్పలరాజుతో కలిసి కోటబొమ్మాళి పెద్దచెరువు, కొత్తపేట కొండదరి ఇందిరమ్మ కాలనీలను పరిశీలించారు. కొండపైన గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టాలిచ్చిన లబ్ధిదారులు ఎంతవరకు ఇళ్ల నిర్మాణం చేపట్టారనే విషయమై ఆరా తీశారు. ఈ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఎంత మేరకు ఉంది అన్న నివేదికను తనకు ఇవ్వాలని ఆర్‌డీవో రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావు, ఆర్‌ఐ పవిత్ర తదితరులు ఉన్నారు.