Share News

తారకనామ యజ్ఞానికి అంకురార్పణ

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:05 AM

చిన్నకర్రివానిపాలెం గ్రామంలో తారకనామ యజ్ఞం నిర్వహణకు మంగళవారం అంకురార్పణ చేశారు.

తారకనామ యజ్ఞానికి అంకురార్పణ
గంగాజలాన్ని గ్రామానికి తీసుకువస్తున్న భక్తులు

కవిటి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): చిన్నకర్రివానిపాలెం గ్రామంలో తారకనామ యజ్ఞం నిర్వహణకు మంగళవారం అంకురార్పణ చేశారు. గ్రామంలోని కాశీవిశ్వనాథస్వామి దేవాలయ ఆవరణలో ఈ నామయజ్ఞాన్ని చేపడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. మంగళవారం సముద్ర తీరంలో ప్రత్యేకపూజలు నిర్వహించి గంగా హారతి ఇచ్చి జలాన్ని తీసుకువచ్చి యజ్ఞకుండలిని ప్రారంభించారు. సింహాద్వార ప్రతిష్ఠ చేపట్టనున్నారు. ఐదు రోజులపాటు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:16 AM