ఒడిశా టు తమిళనాడు
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:51 PM
ఒడిశాలో కొనుగోలు చేసిన గంజా యిని ఇచ్ఛాపురం రైలు మార్గం ద్వారా తమిళనా డుకు తరలించేందుకు సిద్ధ మైన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు.
- 5 కేజీల గంజాయితో ముగ్గురి అరెస్టు
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఒడిశాలో కొనుగోలు చేసిన గంజా యిని ఇచ్ఛాపురం రైలు మార్గం ద్వారా తమిళనా డుకు తరలించేందుకు సిద్ధ మైన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. శనివారం సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు, తిరుప్పూరు జిల్లాలకు చెందిన ముత్తుకుమార్, ఉదయ్ కుమార్, ముత్తురామలింగం ఒడిశా రాష్ట్రం మోహన్ ఏరియాలో కొనుగోలు చేసిన 5 కేజీల గంజాయితో బస్సులో ఇచ్ఛాపురం వచ్చి తమిళనాడుకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ ముకుందరావుకు సమాచారం రావడంతో రైల్వే స్టేషన్‌కు వెళ్లి అనుమానస్పదంగా కనిపించిన వీరు ముగ్గురి వద్ద తనిఖీ చేపట్టారు. 5 కేజీల గంజాయిని గుర్తించి సీజ్ చేసి నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందుతులు గంజాయి తాగేందుకు అలవాటు పడి వారి జల్సాల కోసం తమిళనాడు రాష్ట్రం తిరుప్పూరు జిల్లాకు చెందిన గంజాయి వ్యాపారి పాం డ్యరాజు వద్ద గంజాయినికొని తాగేవారు. గంజాయి అమ్మే కొయింబత్తూరు జిల్లాకు చెందిన కుమార్ (అత్తవారి గ్రామం ఒడిశా రాష్ట్రం మోహన్ ఏరియా) వెళ్లి అతని వద్ద 5 కేజీల గంజాయిని కొని తీసుకొస్తే ఒకొక్కరికి రూ.1000 చొప్పున నగదుతో పాటు తాగటానికి గంజాయిని ఇస్తానని చెప్ప డంతో ఈ ముగ్గురు అంగీకరించారు. తమిళనాడు నుంచి ఒడిశా చేరుకుని అక్కడ కొనుగోలు చేసిన గంజాయితో ఇచ్ఛాపురం వస్తుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నమనాయుడు, పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు.