Share News

ఒడిశా టు సూరత్‌

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:02 AM

ఒడిశా నుంచి సూరత్‌ కు పది కేజీల గంజా యి తరలిస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీ సులు పట్టుకున్నట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు.

ఒడిశా టు సూరత్‌
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్సీ వెంకటప్పారావు

ఇచ్ఛాపురం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి సూరత్‌ కు పది కేజీల గంజా యి తరలిస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీ సులు పట్టుకున్నట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. బుధవారం సర్కిల్‌ కార్యాలయంలో సీఐ మీసాల చిన్నమ నాయుడు, పట్టణ ఎస్‌ఐ ముకుందరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. డీఎస్పీ కథనం మేరకు.. ఒడిశాలోని అస్కా ముమిదహ గ్రామానికి చెందిన బూరగాన సింహాం చలపాత్ర, సంజయ బెహరా సూరత్‌లో పనిచేస్తున్నారు. అక్కడ గంజాయి వ్యాపారం చేసే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన చెప్పిన విధంగా గంజాయిని ఒడిశా నుంచి తీసుకువెళ్లి కేజీకి రూ.తొమ్మిది వేలు చొప్పున తీసుకునేవారు. ఈ క్రమంలో గంజాయిని ఇచ్చేందుకు అంగీకరించిన సింహాంచల పాత్ర తనకు తెలిసిన గంజాం జిల్లా కొద్ద గ్రామానికి చెందిన గంజాయి అమ్మే వ్యక్తి వద్ద 10 కేజీల 310 గ్రాముల కొనుగోలు చేశారు. ఆ గంజాయితో బస్సులో ఇచ్ఛా పురం చేరుకున్నారు. ఇక్కడి నుంచి సూరత్‌ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు చేరు కుని అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టణ పోలీసులు తనిఖీ చేపట్టి వారి వద్ద ఉన్న గంజాయిని ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు.

Updated Date - Mar 13 , 2025 | 12:02 AM