Share News

ఒడిశా టు మహారాష్ట్ర

ABN , Publish Date - Aug 07 , 2025 | 11:53 PM

ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా నుంచి మహారాష్ట్రలోని హింగోళి జిల్లాకు తరలిస్తున్న గం జాయిని పోలీసు లు పట్టుకున్నారు.

ఒడిశా టు మహారాష్ట్ర
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకట అప్పారావు

  • 10.18 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్టు

ఇచ్ఛాపురం, ఆగస్టు 7(ఆంధ్ర జ్యోతి): ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా నుంచి మహారాష్ట్రలోని హింగోళి జిల్లాకు తరలిస్తున్న గం జాయిని పోలీసు లు పట్టుకున్నారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు గురువారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హింగోలి జి ల్లా అసొలా టర్ఫీ ఔండా గ్రామానికి చెందిన విశాల్‌ రమేష్‌ కీర్తనే ఆర్థిక పరిస్థి తి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేసే వరుసకు అన్నయ్య అయిన గణపత్‌ కీర్తనేను కలిశాడు. దీంతో ఒడిశా నుంచి గంజాయి తెస్తే కిలోకి రూ.1000 ఇస్తానని చెప్పాడు. ఇందుకు విశాల్‌ రమేష్‌ ఒప్పుకున్నాడు. అయితే ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ప్రాంతానికి చెందిన జిత్తును గురువారం కలిసి 10.18 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. దీనిని బస్సులో ఇచ్ఛాపురం చేరుకు న్నాడు. అక్కడ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా ఎం.తోటూరు రైల్వే ఎల్‌సీ గేటు వద్ద రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు తనిఖీలు చేయగా గంజాయి ప్యాకెట్లు బయ టపడ్డాయి. దీంతో వాటిని సీజ్‌ చేసి విశాల్‌ రమేష్‌ కీర్తనేను అరెస్టు చేసి రిమాం డ్‌కు తరలించామని డీఎస్సీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నమ నాయుడు, రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 11:53 PM