Share News

ఒడిశా బృందం ఎస్‌హెచ్‌జీల పరిశీలన

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:05 AM

గార మండలంలో డీఆర్‌డీఏ, వెలుగు ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) పని తీరు, వారి జీవన ప్రమాణాలు మెరుగుకు చేపడుతున్న

ఒడిశా బృందం ఎస్‌హెచ్‌జీల పరిశీలన
ప్రకృతి సేద్యం గురించి ఒడిశా బృందానికి వివరిస్తున్న అధికారులు

గార, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): గార మండలంలో డీఆర్‌డీఏ, వెలుగు ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) పని తీరు, వారి జీవన ప్రమాణాలు మెరుగుకు చేపడుతున్న కార్యక్రమాలను ఒడి శా అధికారుల బృందం మంగళవారం పరిశీలించింది.మంగళవారం గార వెలు గు కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యులకు భువ నేశ్వర్‌కు చెందిన సీఈవో మహాప్రాతో, డైరెక్టర్‌ ఎస్‌.రాత్‌తో కూడిన అధికారుల బృందం అవగాహన కల్పించింది. ఈసందర్బంగా మహిళా సమాఖ్యకు చెందిన పలువురు సభ్యులతో ఒడిస్సా అధికారులబృందం వ్యాపారాలు, జీవన ప్రమాణా లు, పిల్లలచదువులు అడిగితెలుసుకుంది.ఈసందర్భంగా ఒడిశాఅధికారుల బృం దం సభ్యుడు మహాపాత్రో ఎస్‌.రాత్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో స్వయం సహాయక సంఘాల పనితీరు, వారి జీవన ప్రమాణాలు మెరుగుకు చేపడుతు న్న ఆర్థికకార్యకలాపాలు, రసాయనఎరువులు వాడకుండా ప్రకృతిసేద్యం, అక్షరా స్యత, విద్య మొదలైన అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు. తమ రాష్ట్రంలో ఇక్కడ అనుసరిస్తున్న విఽధానం ద్వారా మహిళా సంఘాలకు ఎలా చేయూత ఇవ్వాలి అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం పర్యటిస్తున్నట్లు చె ప్పారు.వెలుగు పనితీరు,సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు అమలు తీరును ఏపీఏం వి.సుజాత వారికి వివరించారు.కార్యక్రమంలో సెర్ఫ్‌ అధికా రులు శేఖర్‌ మూర్తి, మండల సమాఖ్య అఽధ్యక్షురాలు సుశీల, కోశాధికారి, కె. దమయంతి, వెలుగు సీఎఫ్‌లు, సీసీలు, ప్రకృతి సేద్యం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:05 AM