మేడపై నుంచి జారిపడి ఒడిశా వాసి మృతి
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:06 AM
కాశీబుగ్గ రాజీవ్‌గాంధీ బస్‌కాంప్లెక్స్ వద్ద గురువారం ఉదయం మేడపై నుంచి జారిపడి ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా సనాసాడ గ్రామానికి చెందిన జగన్నాథ బెహరా(50) మృతి చెందాడు.
పలాస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ రాజీవ్‌గాంధీ బస్‌కాంప్లెక్స్ వద్ద గురువారం ఉదయం మేడపై నుంచి జారిపడి ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా సనాసాడ గ్రామానికి చెందిన జగన్నాథ బెహరా(50) మృతి చెందాడు. వేకువ జాము బస్‌కాంప్లెక్స్ వద్ద రక్తపుమడుగులో జగన్నాథ బెహరా పడిఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ పి.సూర్యనారాయణ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఐడీఎస్‌ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ పైన బెహరా వినియోగించిన బ్యాగు, దుస్తులు లభించాయి. ఆ ప్రాంతంలో మద్యం సీసాలు కూడా లభించింది. దీంతో మద్యం మత్తులో తూలి కిందపడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంనకు తరలించారు. అనంతరం శవాన్ని ఆయన కుటుంబీలకులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
వృద్ధుడి అదృశ్యంపై ఫిర్యాదు
లావేరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కేశవరాయుని పాలెం గ్రామానికి చెందిన నాయిన కనకరాజు (60) అ దృశ్యమైనట్లు అతని కుమారుడు నాయిన సతీష్ గురు వారం లావేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కన కరాజుకు మతిస్థిమితం లేకపోవడంతో అక్టోబరు 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని సతీష్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరికైనా అతని ఆచూకీ తెలిసి నట్లయితే లావేరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాల ని పోలీసులు కోరారు. సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు.
దొంగతనం కేసులో ముగ్గురి అరెస్టు
వజ్రపుకొత్తూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): గరుడుభద్ర కూడలిలో ఉన్న మోడరన్ ఫర్నీచర్ దుకాణంలో ఈ నెల 4న జరిగిన దొంగతనం కేసులో ముగ్గు రు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. దుకాణ యజమాని చె ల్లూరు సోమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే యగా.. నలుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. గురువారం అక్కుపల్లి శివాలయం వద్ద నలుగురులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నట్టు చెప్పారు. వీరిని పలాస కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్ విధించినట్టు తెలిపారు.