గంజాయితో ఒడిశా వాసి అరెస్టు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:46 AM
ఒడిశా రాష్ట్రం మోహన సమితి బల్లి సాహి గ్రామానికి చెందిన రాజేంద్రసబార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 10.795 కిలో ల గంజాయిని ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ సీఐ వై.రామ కృష్ణ తెలిపారు.
పలాస, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం మోహన సమితి బల్లి సాహి గ్రామానికి చెందిన రాజేంద్రసబార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 10.795 కిలో ల గంజాయిని ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ సీఐ వై.రామ కృష్ణ తెలిపారు. బిజి గొమంగో నుంచి రాజేంద్రసబార్ గంజాయి కొనుగోలు చేసుకొని తమిళనాడు రాష్ట్రానికి చెందిన సన్యప్పన్‌కు అందించడానికి బస్సులో బయలుదేరాడు. కోసంగిపురం జంక్షన్ వద్ద బస్సు దిగి రైల్వేస్టేషన్‌కు వస్తుండగా పోలీసులు తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేసినట్టు తెలిపారు. పలాస కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు.