అతిథి గృహంలో ఒడిశా గవర్నర్ విశ్రాంతి
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:08 AM
ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళుతూ శనివారం పలాస మండలం రామకృష్ణాపురం పవర్ గ్రిడ్ అతిథి గృహంలో కొంతసేపు సేదతీరారు.
స్వాగతం పలికిన అధికారులు
పలాసరూరల్,ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళుతూ శనివారం పలాస మండలం రామకృష్ణాపురం పవర్ గ్రిడ్ అతిథి గృహంలో కొంతసేపు సేదతీరారు. ఆయనకు తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి, పోలీసు ఉన్నతా ధికారులు, ఆర్‌ఐ ఖగేశ్వరనాయుడు, సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. పోలీసులు ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్‌తో స్వాగతం పలికారు. సుమారు అరగంట పాటు విశ్రాంతి అనంతరం విశాఖపట్నం బయలు దేరారు. ఆయనతో పాటు ఒడిశా రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నారు.