Share News

కాలువ ఆక్రమించి.. పునాది నిర్మించి

ABN , Publish Date - Jul 28 , 2025 | 11:43 PM

: పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో గల ఒకటో వార్డు మొగిలిపాడు దత్తాశ్రమానికి వెళ్లేదారిలోగల వరద కాలువపై ఓ వ్యాపారి రక్షణగోడకోసం పునాది నిర్మాణం చేపడుతుండడంతో స్థానికులు ఆందో ళన వ్యక్తంచేస్తున్నారు.

 కాలువ ఆక్రమించి..  పునాది నిర్మించి
మొగిలిపాడు వద్ద వరదకాలువ(వృత్తంలో)పై పునాది నిర్మిస్తున్న దృశ్యం:

పలాస, జూలై 28(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో గల ఒకటో వార్డు మొగిలిపాడు దత్తాశ్రమానికి వెళ్లేదారిలోగల వరద కాలువపై ఓ వ్యాపారి రక్షణగోడకోసం పునాది నిర్మాణం చేపడుతుండడంతో స్థానికులు ఆందో ళన వ్యక్తంచేస్తున్నారు. మొగిలిపాడు చెరువుకు సంబంధించిన నీరు పంట పొలా లకు వెళ్లే దారిలో ఆయన స్థలంతో పాటు పక్కన ఉన ్న కాలువను రెండు సెంట్లు ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నాడు. వారంరోజుల నుంచి పనులు జరగుతున్నా యి. నిర్మాణం పూర్తయితే చెరువు నీరు సులభంగా వెళ్లడానికి మార్గం ఉండదని రైతులువాపోతున్నారు. ఈవిషయం తెలుసుకున్న మునిసిపల్‌కమిషనర్‌ ఎన్‌.రా మారావు నిర్మాణస్థలాన్ని సోమవారం పరిశీలించారు. పనులు నిలిపివేయాలని, అనుమతి పత్రాలు మునిసిపల్‌ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.

Updated Date - Jul 28 , 2025 | 11:43 PM