Share News

ఆశ్రమ పాఠశాల పరిశీలన

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:50 PM

బందపల్లి ఆశ్రమ బాలికల పాఠశా లను ఎస్టీ కమి షన్‌ సభ్యులు నా గ మల్లేశ్వరావు శనివారం పరిశీ లించారు.

ఆశ్రమ పాఠశాల పరిశీలన
వివరాలు తెలుసుకుంటున్న ఎస్టీ కమిషన్‌ సభ్యుడు

మెళియాపుట్టి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): బందపల్లి ఆశ్రమ బాలికల పాఠశా లను ఎస్టీ కమి షన్‌ సభ్యులు నా గ మల్లేశ్వరావు శనివారం పరిశీ లించారు. ఆశ్రమ పాఠశాలలో గతంలో వార్డెన్‌గా పనిచేసిన సమయంలో పీఈ టీ కల్యాణి భర్త రామచంద్రరావు విద్యార్థినిపై దొంగ తనం నేరం మోపి చేయి చేసుకున్న సంఘటపై విచారణ చేపట్టారు. విద్యార్థిని తల్లితో పాటు విద్యార్థిని నుంచి వివరాలు సేకరించారు. దీంతో పాటు గతంలో పాఠశాలలో పనిచేసిన హెచ్‌ఎం లలిత, ప్రస్తుతం పనిచేస్తున్న హెచ్‌ఎం ప్రశాంతి నుంచి వివరాలు సేకరించారు. దీంతో పాటు గిరిజన సంఘాల నేతలు ఎస్‌.గణేష్‌, ఎస్‌.వెంటేష్‌ కమిషన్‌ సభ్యుని కలిసి వినతిపత్రం అందజేశారు. కల్యాణి భర్త పై కేసు నమోదు చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన భోనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై నివేదికను ఎస్టీ కమిషన్‌కు నివేదిక అందజేస్తామన్నారు. అలాగే పీఈటీ కల్యాణి భర్త రామ చంద్రరావు పై కేసు నమోదు చేయాలని కోరుతూ గిరిజన, దళిత సంఘాల నాయకులు లక్ష్మీనారాయణ, బి.నారాయణరావు, కె.శ్రీనివాసరావు శనివారం ఎస్‌ఐ రమేష్‌బాబును కలిసి వినతి పత్రం అందజేశారు.

Updated Date - Dec 27 , 2025 | 11:50 PM