Share News

వృద్ధులకు అండగా ఎన్టీఆర్‌ పింఛన్‌

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:46 PM

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ వృద్ధులకు కొండంత అండగా నిలుస్తుందని మం త్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

వృద్ధులకు అండగా ఎన్టీఆర్‌ పింఛన్‌
ఆదివారంపేటలో పింఛన్‌ పంపిణీ చేస్తున్న మంత్రి అచ్చెన్న

-18 నెలల్లో రూ.50వేల కోట్లు అందించాం

-మంత్రి అచ్చెన్నాయుడు

అరసవల్లి/కోటబొమ్మాళి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ వృద్ధులకు కొండంత అండగా నిలుస్తుందని మం త్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆదివారంపేట, కోటబొమ్మాళి పంచాయతీ ప్రకాశనగర్‌ కాలనీలో వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో లబ్ధిదారులకు రూ.50వేల కోట్ల విలువైన పింఛన్లు అందజేశామని తెలిపారు. వృద్ధా ప్యంలో కనీస అవసరాల కోసం, అలాగే మందులు కొనుక్కునేందుకు గాను ఈ పింఛను నగదు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కోటబొమ్మాళి పంచాయతీలో ఈ 18 నెలల్లో రూ.7కోట్ల వ్యయంతో 59 సీసీ రోడ్డు వేశామన్నారు. జిల్లాలోనే టెక్కలి నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోం దని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, కోటబొమ్మాళిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కళింగవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ బో యిన గోవిందరాజులు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు వెలమల విజయలక్ష్మి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్‌ అప్పలరాజు, ఎంపీడీవో ఫణీంద్ర కుమార్‌, టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌, నాయకులు కల్లి నాగయ్యరెడ్డి, లక్ష్మణరెడ్డి, శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీ

అరసవల్లి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్ల కిందట ఇళ్లు నిర్మించుకుని, వాటికి పన్నులు కడుతున్నా ఆ నివాసాలపై ఎటువంటి హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందని మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం కంపోస్టు కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి జీవో నెంబరు 30 ప్రకారం క్రమబద్ధీకరించిన ఇళ్లకు సంబంధించిన పట్టాలను లబ్ధిదా రులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కం పోస్టు కాలనీని చంద్రన్న కాలనీగా మారుస్తున్నామని ప్రకటించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్డీవో సాయి ప్రత్యూష, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 11:46 PM