Share News

ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు చేయించాలి

ABN , Publish Date - May 28 , 2025 | 11:54 PM

ప్రభుత్వ సామాజిక ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు చేయించాలని, దీనిపై గర్భిణుల తల్లిదండ్రులకు మరింత అవగాహన కలిగించాలని డీసీహెచ్‌ఎస్‌ డా.కల్యాణ్‌బాబు అన్నారు.

 ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు చేయించాలి
వైద్యులతో మాట్లాడుతున్న డీసీహెచ్‌ఎస్‌ డా.కల్యాణ్‌బాబు

డీసీహెచ్‌ఎస్‌ డా.కల్యాణ్‌బాబు

నరసన్నపేట, మే 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సామాజిక ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు చేయించాలని, దీనిపై గర్భిణుల తల్లిదండ్రులకు మరింత అవగాహన కలిగించాలని డీసీహెచ్‌ఎస్‌ డా.కల్యాణ్‌బాబు అన్నారు. బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. సర్జరీ ద్వారా జరిగే ప్రసవాలతో కలిగే అనర్ధాలను వారికి వైద్యులు తెలియజేయాలన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సకాలంలో రావాలని, రెండో పూటలా రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ శ్రీనివాసబాబు, పరిపాలన సూపరింటెండెంట్‌ రమణమూర్తి, ఏవో కాళీచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 02:55 PM