నామినేషన్లు వేసి.. పోలింగ్ నిర్వహించి
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:39 PM
సారవకోట ఉన్నతపాఠశాలలో బుధవారం హెచ్‌ఎం రామకృష్ణారావు ఆధ్వర్యంలో పార్లమెంటరీ పద్ధతిలో ఎస్‌పీఎల్ ఎన్నిక నిర్వహించారు. ఈ సం దర్భంగా నామినేషన్లు అనంతరం పోటీల్లో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు.
జలుమూరు (సారవకోట), సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సారవకోట ఉన్నతపాఠశాలలో బుధవారం హెచ్‌ఎం రామకృష్ణారావు ఆధ్వర్యంలో పార్లమెంటరీ పద్ధతిలో ఎస్‌పీఎల్ ఎన్నిక నిర్వహించారు. ఈ సం దర్భంగా నామినేషన్లు అనంతరం పోటీల్లో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. అనంతరం పోలింగ్‌ను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించారు.ఈ మేరకు మొత్తం ఓట్లు 239 పోల్ కాగా దేవాది హేమసుందర్ 120 ఓట్లు మెజారిటీతో గెలిపొందినట్లు హెచ్‌ఎం తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులుగా ఎంఈవో ఎంవీ రమణ, ఎంఈవో-2 భూలక్ష్మి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.