మరుగుదొడ్లు లేవు.. తాగునీరు లేదు
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:11 PM
గారలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. మరుగుదొడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు సైతం లేవు. మూడు దశాబ్దాల కిందట నిర్మిం చిన బస్టాండ్ నిర్వహణ లోపం వల్ల శిథిలావస్థకు చేరింది.

గార, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): గారలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. మరుగుదొడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు సైతం లేవు. మూడు దశాబ్దాల కిందట నిర్మిం చిన బస్టాండ్ నిర్వహణ లోపం వల్ల శిథిలావస్థకు చేరింది.
గారలో మూడు దశాబ్దాల కిందట మూడు రోడ్లు కూడలిలో చుటుపక్కల గ్రామాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్ నిర్మించారు. తర్వాత కాలంలో కనీస మరమ్మతులు, నిర్వహణకు నోచుకోకపోవడంతో స్తంభాలు బీటలు వారిపోయా యి. గోడలకు పెచ్చులూడుతున్నాయి.దీంతో ఇక్కడకు వచ్చే ప్ర యాణికులు భయాందోళన చెందుతున్నారు. బస్టాండ్‌లో ప్రయా ణికుల కోసం బల్లలు లేకపోవడంతో సిమెంట్ దిమ్మల మీద కూర్చోవల్సి వస్తోంది. బందరువానిపేట, శ్రీకాకుళం తదితర ప్రాం తాలకు వెళ్లే వారంతా చెట్ల కింద, దుకాణాల చెంతన ఉంటున్నా రు. శ్రీకాకుళంలోని పలు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వెళ్లేందుకు రోడ్డుపైనే వేచిఉం టున్నారు.బస్టాండ్‌లో కూర్చోడానికి బల్లలు లేక చెట్టు కింద వాహ నాలు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. విద్యుత్ సౌకర్యం లేకపో వడంలో చీకటిపడిన తర్వాత అంధకారంగా మారుతోంది. తాగు నీరు, మరుగుదొడ్లువంటి సదుపాయాలు లేకపోవవడంతో మహి ళలు, వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.