Share News

సిబ్బంది లేరు.. సబ్‌స్టేషన్‌ లేదు

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:59 PM

శ్రీకూర్మం పంచాయతీ లో విద్యుత్‌ వ్యవస్థలో సమస్యలు నెలకొన్నాయి. ప్రధానంగా సిబ్బంది కొరత, లోవోల్టేజీ వల్ల వినియోగదారులు అవస్థలకు గురవుతున్నారు. ఇక్కడ సబ్‌స్టేషన్‌ కూడా లేదు. దీంతో తరచూ విద్యుత్‌ సరఫరాకు అం తరాయం కలుగుతోంది.

సిబ్బంది లేరు.. సబ్‌స్టేషన్‌ లేదు
శ్రీకూర్మంలోని ట్రాన్స్‌ఫార్మర్‌

గార రూరల్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మం పంచాయతీ లో విద్యుత్‌ వ్యవస్థలో సమస్యలు నెలకొన్నాయి. ప్రధానంగా సిబ్బంది కొరత, లోవోల్టేజీ వల్ల వినియోగదారులు అవస్థలకు గురవుతున్నారు. ఇక్కడ సబ్‌స్టేషన్‌ కూడా లేదు. దీంతో తరచూ విద్యుత్‌ సరఫరాకు అం తరాయం కలుగుతోంది.

ఇదీ పరిస్థితి

గార మండలంలోని శ్రీకూర్మం మేజర్‌ పంచాయతీ పరిధిలో 32 గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 6000 ఇళ్లు, 13000 మంది ఓటర్లు ఉన్నారు. తీరప్రాంత గ్రామాలతోపాటు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మనా థుని ఉంది. ఇక్కడ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు పెద్దమొత్తంలో జరుగుతుంటాయి. ఇంతటి ప్రాధాత్యం ఉన్న శ్రీకూర్మంలో గ్రామస్థులు నిత్యం విద్యుత్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ పరిధిలో పాలనాపరమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు శ్రీకూర్మం, ఎస్‌. మత్స్యలేశం, దువ్వుపేట, తండ్యాలపేట గ్రామసచివాలయాలు ఏర్పా టుచేశారు. 32గ్రామాల్లో ఆరువేలకుపైగా డొమస్టిక్‌ సర్వీసులు, 60 పరి శ్రమల సర్వీసులు, 280 విద్యుత్‌ మోటారు కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్‌ బిల్లుల చెల్లింపు పరంగా మండలంలోనే విద్యుత్‌ సంస్థకు శ్రీకూర్మం నుంచి ఎక్కువ ఆదాయంవస్తోంది. అయితే పంచాయతీకి 24 గంటల విద్యుత్‌ సదుపాయంకోసం సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ సిబ్బంది కొరత వేధిస్తోంది. నాలుగు సచివాలయా లకు సంబం దించి లైన్‌ఇన్‌స్పెక్టర్‌, లైన్‌మెన్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌తో పాటు ఒక్కో సచివాలయం పరిధిలో ఇద్దరేసి జూనియర్‌ లైన్‌మెన్లు నిబంధనల ప్రకారం మొత్తంగా 11 సిబ్బంది అవసరం. అయితే కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే విధులు నిర్వస్తున్నారు. దీంతో ఒకోసారి ప్యూజ్‌పో యినా శ్రీకూర్మం పంచాయతీ పరిధిలో మొత్తం గంటల తరబడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది.

రొయ్యల చెరువులు.. రైస్‌ మిల్లులు

గ్రామానికి వెనుక భాగంలో ఉన్న రొయ్యల చెరువులు, గ్రామానికి చుట్టు ఉన్న రైస్‌ మిల్లులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా లైన్‌ ఉంది. గ్రామానికి 24 గంటల విద్యుత్‌ లైన్‌ ఏర్పాటుకు సుమారుగా 90 కిలో మీటర్ల దూరం నుంచి లైన్‌ వేసుకొని రావాలని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన విద్యుత్‌ తీగల వల్ల నిత్యం ఫ్యూజ్‌లు పోవడం, తీగలు తెగిపోవడం వంటి సాంకేతికమైన సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ సమస్యలు వర్షాకాలంలో మరి ఎక్కువగా ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా, గాలివీచినా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి రాత్రి వేళల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే కొందరు చోరీలకు తెగబడుతున్నారని, ఇటీవల గ్రామంలో ఉన్న ఓ బ్యాంకులో మేనేజర్‌ గది గోడకు రంధ్రం చేసి చోరీకి ప్రయత్నించగా చుట్టు పక్కల వారు కేకలు వేయడంతో దుండగలు పరారయ్యారని గ్రామస్థులు తెలిపారు.

వేలాపాలా లేకుండా అంతరాయం

తరచూ విద్యుత్‌సమస్యలతో ఎక్కువగా వ్యా పారస్తులం ఇబ్బంది పడుతున్నాం. వేళాపాలా లేకుండ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలు గుతుంది.రాత్రివేళల్లో విద్యుత్‌ నిలిచిపోతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నాం.

-ఎ.చందు, బంగారం వ్యాపారి

మంత్రి దృష్టికి తీసుకువెళ్లాం

ట్రాన్స్‌పార్మర్లు అవసరం మేరకు లేకపోవ డంతో లోవోల్టేజీ ఇబ్బంది ఎక్కువగా ఉంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరి ష్కారంకాలేదు.ఎమ్మెల్యే శంకర్‌,మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు దృష్టికితీసుకెళ్లాం. సాను కూలంగా స్పందించారు. త్వరలో పరిష్కారం అవుతుంది.

-వీఎస్‌ గిరి, టీడీపీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు

హడావుడి చేసి స్థల పరిశీలనచేశారు

వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణానికి హడాహుడిగా స్థల పరిశీలనచేసి ఓట్లు వేయిం చుకున్నారు. ఉపకేంద్రం ఏర్పాటు జరగలేదు. ఉపకేంద్రం ఏర్పాటుచేస్తే తప్పా విద్యుత్‌ సమ స్యలు పరిష్కారం కావు..

- సీహెచ్‌ కూర్మారావు, గాజుల వ్యాపారి

Updated Date - Sep 23 , 2025 | 12:00 AM