Share News

ఏప్రిల్‌ నుంచి వేతనాల్లేవు

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:07 AM

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, అయితే ఏప్రిల్‌ నుంచి వేతనాలు చెల్లించలే దని, దీంతో ఇబ్బం దులు పడుతున్నామని సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

 ఏప్రిల్‌ నుంచి వేతనాల్లేవు
గ్రీవెన్స్‌కు వచ్చిన రిమ్స్‌ సెక్యూరిటీ గార్డులు

గ్రీవెన్స్‌లో రిమ్స్‌ సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, అయితే ఏప్రిల్‌ నుంచి వేతనాలు చెల్లించలే దని, దీంతో ఇబ్బం దులు పడుతున్నామని సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ను కలిసి సమస్యను విన్నవించారు. కాంట్రాక్టర్‌ మారిన ప్రతిసారి నెలల తరబడి వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబా లను పోషించు కునేందుకు ఇక్క ట్లకు గురికావాల్సి వస్తోందని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. పాత కాంట్రాక్టర్‌ ఏప్రిల్‌, మే, కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్‌ కూడా జూన్‌, జూలై వేతనాలు ఇంతవరకు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

నా ఇంటికి సరైన ధర ఇవ్వండి

తాను 15 ఏళ్లుగా దేశ సరిహద్దులో సైనికుడిగా సేవలందిస్తున్నానని, తన కష్టార్జితంతో స్వగ్రా మంలో కట్టుకున్న ఇంటికి పోర్టు అధికారులు తక్కువ ఎస్టి మేషన్‌ వేశారని, తనకు న్యాయం చేయాలని సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామానికి చెందిన దుర్గాశి చిట్టయ్య వేడుకున్నా రు. ఈ మేరకు సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. తాను ఇంటిని రూ.50 లక్షలతో నిర్మించుకు న్నానని, అయితే మూలపేట పోర్టు నిర్మాణంలో తన ఇల్లు కోల్పోతు న్నానని, దీనికి అధి కారులు రూ.24 లక్షలే ఎస్టిమేషన్‌ వేశారని, కనీసం ఎస్టిమేషన్‌ కాపీ కూడా ఇవ్వడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. తన ఇంటికి సరైన ధర ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.

పింఛన్‌ ఆగిపోయింది.. బతికేదెలా?

తాను ఏ పనీ చేయలేని నిస్సహాయుడినని.. తనకు వచ్చిన దివ్యాంగ పింఛన్‌ నిలిపివేశారని, న్యాయం చేసి పింఛన్‌ పునరుద్ధరించాలని సార వకోట మండలం గొర్రిబంద గ్రామానికి చెందిన రావాడ నవీన్‌ కోరాడు. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించాడు. హఠాత్తుగా నా పింఛనును రద్దు చేస్తున్నట్లు నోటీసిచ్చారు. దాం తో ఏం చేయాలో తెలియని పరిస్థితి. రీ వెరిఫి కేషన్‌లో నా పేరు లేదంటూ చెప్పారు. నేను ఏం తప్పు చేశానని ఇలా జరిగిందో తెలియడం లేదు. పింఛన్‌ వచ్చేలా సాయం చేయాలని వేడుకున్నాడు.

Updated Date - Aug 19 , 2025 | 12:07 AM