ఆర్వో ప్లాంట్ వద్దు..
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:43 PM
భూగర్భ జలాలను పరిరక్షించాలని, ఇప్పటికే వ్యవసాయ బోర్ల నుంచి నీరందడం లేదని రణస్థలం పంచాయతీ నగరప్పాలేం, బండిపాలేం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
రణస్థలం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలను పరిరక్షించాలని, ఇప్పటికే వ్యవసాయ బోర్ల నుంచి నీరందడం లేదని రణస్థలం పంచాయతీ నగరప్పాలేం, బండిపాలేం గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం సంబంధిత ప్లాంట్ యాజమాన్యం రైతుల తో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. అయితే రైతులు, గ్రామస్థులు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి పంటలకు నీరందకుండా చేయవద్దని, దీనిని పూర్తిగా వ్యతిరే కిస్తున్నామని ముక్తకంఠంతో తెలిపారు. ఆర్వో ప్లాంట్ విధి విధానాలను సంబంధిత ప్లాంట్ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కరిమజ్జి మల్లేశ్వరరావు, కరిమజ్జి జగన్నాఽథం, బాషా, మజ్జి రమేష, చందక రమణ తదితరులు మాట్లాడుతూ.. ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తే కొన్ని వందల అడుగుల్లో బోర్లు వేసి నీరు తీస్తారని, 100, 150 అడు గుల్లో బోర్లు ఏర్పాటు చేసుకుని పంటలు పండిస్తున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్లాంట్‌కు అనుమతులు ఇస్తే ఊరుకు నేదని స్పష్టం చేశారు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయ వద్దని ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశామని పలువురు రైతులు తెలిపారు.