Share News

ఎవరూ అధైర్య పడొద్దు: రవికుమార్‌

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:01 AM

మొంథా తుఫాన్‌ ప్రభా వంతో వివిధ రూపాల్లో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని, అధైర్య పడవద్దని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. బుధవారం సరుబుజ్జిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో పునరావాసం పొందుతున్న శ్రీరాంవలస బాధిత 18ఎరుకుల కుటుంబాలకు సాయం అందించారు.

ఎవరూ అధైర్య పడొద్దు: రవికుమార్‌
పంట నష్టాలపై వివరాలు సేకరిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

సరుబుజ్జిలి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభా వంతో వివిధ రూపాల్లో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని, అధైర్య పడవద్దని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. బుధవారం సరుబుజ్జిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో పునరావాసం పొందుతున్న శ్రీరాంవలస బాధిత 18ఎరుకుల కుటుంబాలకు సాయం అందించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారిని తహసీ ల్దార్‌ మధుసూదనరావు గుర్తించి వారికి పునరావాసం కల్పించడం అభినందనీయమన్నారు. ప్రభు త్వం తుఫాన్‌ బాధితులకు మంజూ రు చేసిన రూ.3 వేలు వంతున నగదుతో పాటు నిత్యావసర సరు కులు ఆయన అందించారు. అనంతరం ఎమ్మెల్యే సరుబుజ్జిలి, శరభాపురం, తురకపేట రెవెన్యూ గ్రామాల్లో వరి పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. నష్టాలను నివేదిక రూపొందించి జిల్లా అధికా రులతో పాటు తనకు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.పావని, ఏవో మన థరావు, మండల తెలుగు యువత అధ్యక్షుడు దవళ సింహాచలం, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఇల్లాకుల ప్రభాకర్‌, కొమనాపల్లి రవికుమార్‌, కొర్ను సూర్యనారాయణ పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే కూన రవికుమార్‌ బూర్జ మండలం లోని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించారు. పంట నష్టం వాటిల్లిన రైతులకు ధైర్యం చెప్పారు. ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ ఆనెపు రామకృష్ణ నాయుడు తదితరులున్నారు.

Updated Date - Oct 30 , 2025 | 12:01 AM