Share News

నిర్వహణ లేక.. తాగు నీరందక

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:24 AM

గంగివలస పంచాయతీ పరిధిలోగల ప్రాఽథమికపాఠశాల వద్ద ఏర్పాటుచేసిన చేతిపంపు నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో తాగు నీటికోసం విద్యార్థులు అగచాట్లకు గురవుతున్నారు.

నిర్వహణ లేక.. తాగు నీరందక
బోరు చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలు

పోలాకి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): గంగివలస పంచాయతీ పరిధిలోగల ప్రాఽథమికపాఠశాల వద్ద ఏర్పాటుచేసిన చేతిపంపు నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో తాగు నీటికోసం విద్యార్థులు అగచాట్లకు గురవుతున్నారు. ఇక్కడ 40 మంది విద్యార్థులు చదువుతున్నారు.పాఠశాల ఆవరణలో బోరు పనిచేయకపోవడంతో వీరంతా తాగునీటిని ఇళ్ల నుంచి తీసుకు రావల్సివస్తోంది. వినియో గంలో లేకపోవడంతో బోరు చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో ఆ పరిసరాల్లో విషజంతువులు సంచరించే అవకాశముందని విద్యార్థులు అటు వైపు వెళ్లడానికి భయాందోళన చెందుతున్నారు. ఆరు నెలల కిందట బోరు పాడైనా కనీస మరమ్మతులు చేయడానికి అధికా రులు చర్యలు తీసుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతు న్నారు.లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఏర్పాటుచేసిన బోరు ఎక్కు వ రోజులు వినియోగించకపోతే తుప్పుపట్టి పాడయ్యే అవకాశముం దని పలువురు చెబుతున్నారు. గతంలో సమీపంలో కేజీబీవీ పాఠశాల విద్యార్థినులతోపాటు పరిసరప్రాంతాల్లో నివాసముండే వారి తాగు నీటి అవసరాలనుఈ బోరు తీర్చేది. తక్షణమే అధికారులు స్పందించి బోరు మరమ్మతులు చేయడంతోపాటు చుట్టూఉన్న పిచ్చిమొక్కలు తొలగించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 11 , 2025 | 12:24 AM