మాదక ద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:45 PM
మాదక ద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
నరసన్నపేట, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజలను, యువతను చైతన్య పరిచేందుకు చేపట్టి అభ్యుదయం సైకిల్ యాత్రకు గురువారం మడపాం టోల్‌ప్లాజా వద్దకూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే స్వాగతం పలికారు. టోల్‌ప్లాజా నుంచి కోమర్తి జంక్షన్ వరకు సైకిల్‌పై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ శ్రీనివాసరావు, నియోజవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన తదితరులు యాత్రను కొనసాగించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు శేఖర్, అశోక్‌బాబు, రంజిత్ కూటమి నాయకులు పాల్గొన్నారు. శుక్రవారం సుమారు 5వేల మంది విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.