విధ్వంసకర అభివృద్ధి వద్దు
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:09 AM
ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ, సరుబుజ్జిలి మండలా సరి హద్దు ప్రాంతంలో అభివృద్ధి పేరుతో ఏర్పాటు చేయనున్న విధ్వంసకర థర్మల్ పవర్ ప్లాంట్ వద్దని మానవ హక్కుల సంఘం ఉభయ తెలుగు రాష్ర్టాల సమన్వ యకర్త వీఎస్ కృష్ణ అన్నారు.
మానవహక్కుల సంఘం సమన్వయకర్త వీఎస్ కృష్ణ
సరుబుజ్జిలి/బూర్జ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ, సరుబుజ్జిలి మండలా సరి హద్దు ప్రాంతంలో అభివృద్ధి పేరుతో ఏర్పాటు చేయనున్న విధ్వంసకర థర్మల్ పవర్ ప్లాంట్ వద్దని మానవ హక్కుల సంఘం ఉభయ తెలుగు రాష్ర్టాల సమన్వ యకర్త వీఎస్ కృష్ణ అన్నారు. సోమవారం అడ్డూరిపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక బహిరంగ సభ నిర్వహించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మితో కలిసి మాట్లాడుతూ.. మానవాళి మనుగడకు పర్యావరణానికి వి ఘాతం కలిగించే థర్మల్ పవర్‌ప్లాంట్‌ను నిలుపుదల చేసేం దుకు ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. ప్రమాదకర పవర్ ప్లాంట్ ప్రతిపాదన ఆపకపోతే ప్రజలు, రైతులతో కలిసి పోరా టాలు చేస్తామన్నారు. ఇదిలావుండగా బహిరంగ సభ నిర్వ హణకు అనుమతులపై అనుమానాలు రేకెత్తాయి. అడూ ్డరిపేటలో సభకు అనుమతులు లేవని పేర్కొంటూ పోలీసులు సభను నిలువరించడం జరుగుతుందని ప్రచారం జరిగింది. రాజకీయ పార్టీలు లేకుండా ఆదివాసీలు, రైతులు సభ నిర్వహించుకునేందుకు షరతులతో కూడిన అనుమ తులను పోలీసులు మంజూరు చేసినట్లు తెలిసింది. డీఎస్పీ వివేకా నంద ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ, సరుబుజ్జిలి, బూర్జ ఎస్‌ఐలు హైమావతి, ప్రవల్లిక, బాలరాజు పోలీసులు బందో బస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సురేష్‌దొర, సింహాచలం, రవికాంత్, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, వామపక్ష నేతలు తాండ్ర ప్రకాష్, తామర సన్యాసి రావు, దానేష్, మాధవ రావు తదిత రులు పాల్గొన్నారు.
వైసీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులు
ఆమదాలవలస, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ అభి వృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు పెట్టుకున్నారని ముని సిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతాసాగర్ అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. థర్మల్ పవర్ ప్లాంట్ పై తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీ పీ నాయకుడు చింతాడ రవికుమార్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో టీడీపీ నేతలు నూకరాజు, బోర గోవిందరావు, బోయిన సునీత, సంపతిరావు మురళి తదితరులు పాల్గొన్నారు.