Share News

students certificates: విద్యార్థుల ధ్రువపత్రాలు పెండింగ్‌ వద్దు

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:14 AM

Educational Documents ‘విద్యా సంవత్సరం ఆరంభం వేళ.. విద్యార్థుల ధ్రువపత్రాలు పెండింగ్‌లో ఉంచరాదు. అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాల’ని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు.

students certificates: విద్యార్థుల ధ్రువపత్రాలు పెండింగ్‌ వద్దు
అర్జీదారులతో మాట్లాడుతున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

  • అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి

  • జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ ఖాన్‌

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ‘విద్యా సంవత్సరం ఆరంభం వేళ.. విద్యార్థుల ధ్రువపత్రాలు పెండింగ్‌లో ఉంచరాదు. అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాల’ని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. ‘మీ కోసం’ కార్యక్రమంలో.. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 87 అర్జీలను స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ ‘తహసీల్దార్ల వద్ద వివిధ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌కు గల కారణాలు తెలియజేయాలి. సర్టిఫికెట్లు సకాలంలో జారీ చేయకపోతే విద్యుర్థులు ఇబ్బందులు పడతారు. సత్వరమే సర్టిఫికెట్లు జారీ చేయాలి. రైస్‌ కార్డులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి సంబంధించిన తగు చర్యలు చేపట్టాలి. సచివాలయాల్లో పెండింగ్‌లో ఉన్న వివాహ ధ్రువపత్రాలు కూడా మంజూరు చేయాలి’ అని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి టీబీ ముక్త్‌ భారత్‌ గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా, ఉప కలెక్టర్‌ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.అనిత, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కళ్యాణబాబు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 12:14 AM