Share News

పచ్చని ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్ట్‌ వద్దు

ABN , Publish Date - Oct 09 , 2025 | 12:43 AM

కోన సీమను తలద న్నే పచ్చని ఉ ద్దానంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేప ట్టవద్దని మాజీ మంత్రి, రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు రా ష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

పచ్చని ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్ట్‌ వద్దు
మాట్లాడుతున్న మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు

  • మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

హరిపురం, అక్టోబరు 8(ఆం ధ్రజ్యోతి): కోన సీమను తలద న్నే పచ్చని ఉ ద్దానంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేప ట్టవద్దని మాజీ మంత్రి, రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు రా ష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మందస మండలం ఎం.గంగువాడ గ్రామంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు ఎంతో ఘనమైన పోరాట చరిత్ర ఉందని, ఉద్యమాల పురిటి గడ్డగా పే రుందని గుర్తు చేశారు. ఎయిర్‌పోర్టు పేరుతో బలవంతపు భూసేకరణ చేపడితే అంతే స్థాయిలో ప్రజలనుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరిం చారు. ఈ పచ్చని ఉద్దానంలో ఎయిర్‌పోర్టు పేరుతో సీఎం చంద్రబాబు, జీఎం ఆర్‌ సంస్థ వారు వందలాది ఎకరాల భూములు తీసుకోవటానికి ప్రయత్నిస్తు న్నారని మండిపడ్డారు. రైతులకు అండగా తామంతా ఉంటామని అన్నారు. కా ర్యక్రమం సమన్వయకర్త మహదేవ్‌ మాట్లాడుతూ రైతుల ఆమోదం లేకుండా సెంటు భూమి కూడా తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని, ఐదు లక్షల ఉద్యో గాలు వస్తాయని కేంద్ర మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం ఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు తాండ్ర ప్రకాష్‌, సీపీఎం నాయకులు డి.గోవిం దరావు, చాపర వెంకటరమణ, ప్రజా సంఘాల నాయకులు రామారావు, వంక ల మాధవరావు, పోతనపల్లి కుసుమ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 12:43 AM