త్వరలోనే అర్హులకు కొత్త పింఛన్లు
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:59 AM
pensions distubution ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులకు త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నందిగాం మండలం వల్లభరాయుడుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
నందిగాం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులకు త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నందిగాం మండలం వల్లభరాయుడుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. మాటామంతీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నాం. పింఛన్ పెంపుతో ఎంతోమంది పేదలకు లబ్ధి చేకూరుతోంది. పింఛన్‌దారుడైన భర్త మృతి చెందితే.. ఆ తర్వాత నెల నుంచే ఆయన భార్యకు వితంతువు పింఛన్ అందజేస్తున్నాం. వైసీపీ అప్పుల ఊబిలో నెట్టినప్పటికీ సీఎం చంద్రబాబునాయుడు సమర్థవంతమైన పాలనతో ప్రధానమంత్రి మోదీ తోడ్పాటుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేట’ని తెలిపారు. ‘టెక్కలి నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు రూ.700 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు పిలిచి పథకాన్ని పూర్తిచేస్తాం. రహదారుల నిర్మాణాలు కూడా పూర్తిచేసి అభివృద్ధికి బాటలు వేస్తాం. పంటల బీమా పథకాన్ని పాత విధానంలో అమలు చేస్తున్నాం. మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. అధికారులు సిద్ధం చేసిన నివేదికలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందజేస్తామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, పలాస ఆర్డీవో జి.వెంకటేష్, టీడీపీ నాయకులు పి.అజయ్‌కుమార్, పి.చంద్రశేఖర్, ఎం.బాలకృష్ణ, ఎస్.జానకిరాం, జీరు నానీరెడ్డి, ఎస్.కృష్ణారావు, ఎ.సుదర్శనరావు, ప్రవీణ్‌కుమార్, టి.మన్మఽథరావు, జె.మోహనరావు, కె.ధర్మారావు, బి.సన్యాసిరావు, ఎస్.క్రిష్ణారావు, కూర్మినాయకులు, కె.ప్రసాదరావు, కె.జయరాం పాల్గొన్నారు.