సృజనాత్మకతతోనే నూతన ఆవిష్కరణలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:15 PM
సృజనాత్మకతతోనే నూతన ఆవిష్కరణలకు అవకాశం కలుగుతుందని ఆర్జీ యూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ అన్నారు.
ఎచ్చెర్ల, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): సృజనాత్మకతతోనే నూతన ఆవిష్కరణలకు అవకాశం కలుగుతుందని ఆర్జీ యూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ అన్నారు. ఆఫ్షన్ మేట్ రీసెర్చ్ అండ్ కన్స ల్టింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ (హైదరాబాద్)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఈ క్యాంపస్‌లో డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఆవి ష్కరణలకు ఇంక్యుబేషన్ సెంటర్ వేది క కావాలన్నారు. విద్యార్థుల్లో సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ కేం ద్రం దోహదపడుతుందన్నారు. ఆఫ్షన్ మేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.శశి కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు సృజనాత్మకత ఆలోచనలతో ముందుకు వస్తే సంస్థ ద్వారా అవసరమైన ఆర్థిక సాయం అందిస్తా మన్నారు. కార్యక్ర మంలో క్యాంపస్ పరి పాలనాధికారి డాక్టర్ ముని రామకృష్ణ, అకడమిక్ డీన్ డాక్టర్ ఎస్.రామకృష్ణ, ఎఫ్‌వో సీహెచ్ వాసు, ఇంక్యుబేషన్ సెంటర్ కోఆర్డినేటర్ ఎస్.సతీష్ పాల్గొన్నారు.