quantum technology: క్వాంటం టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:37 PM
Students projects in Quantum క్వాంటం టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆర్జీయూకేటీ పరిధిలోని శ్రీకాకుళం క్యాంపస్‌లో క్వాంటం వ్యాలీ అంతర్గత హ్యాకథాన్‌లో భాగంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్‌లను ఆయన గురువారం పరిశీలించారు.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ఎచ్చెర్ల, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): క్వాంటం టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆర్జీయూకేటీ పరిధిలోని శ్రీకాకుళం క్యాంపస్‌లో క్వాంటం వ్యాలీ అంతర్గత హ్యాకథాన్‌లో భాగంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్‌లను ఆయన గురువారం పరిశీలించారు. క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్, స్టేట్ విజువలైజర్, సూపర్డెన్స్ కోడింగ్ కోడింగ్ ప్రోటోకాల్ తదితర ప్రాజెక్ట్‌లను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ప్రాజెక్ట్‌ల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న హ్యాకథాన్‌లో క్యాంపస్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపాల’ని కలెక్టర్ సూచించారు. క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ మాట్లాడుతూ ‘ఈ విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేషన్‌లో క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేస్తున్నాం. ఇందులో భాగంగా మైనర్ డిగ్రీలో 480 మంది ఎంపిక చేశాం. ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటుకు ప్రతిపాదించాం. జాతీయ రక్షణ, నావిగేషన్, సముద్ర అధ్యయన క్వాంటం సెన్సింగ్ ఫర్ మెరైన్ అప్లికేషన్స్‌ను పరిశోధన, ఆవిష్కరణలకు తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామ’ని తెలిపారు. కార్యక్రమంలో ఏవో డాక్టర్ ముని రామకృష్ణ, డీన్ ఎం.శివరామకృష్ణ, ఎప్‌వో సీహెచ్.వాసు పాల్గొన్నారు.