Share News

నూతన సందడి

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:44 PM

కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోయింది. 2025 కు వీడ్కోలు చెబుతూ.. 2026కు జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు.

 నూతన సందడి
శ్రీకాకుళంలో కేక్‌లు కొనుగోలు చేస్తున్న ప్రజలు

- కొత్త ఏడాదికి స్వాగతం పలికిన జిల్లా ప్రజలు

- అర్ధరాత్రి కేక్‌లు కట్‌ చేసి వేడుకలు

శ్రీకాకుళం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోయింది. 2025 కు వీడ్కోలు చెబుతూ.. 2026కు జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి కేక్‌లను కట్‌చేసి నూతన సంవత్సరా నికి ఆహ్వా నం పలికారు. గతానికి బైబై చెబుతూనే కొత్త సంవత్సరంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని జిల్లా ప్రజలు భగవంతుడిని ప్రార్థించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పుష్పగు చ్ఛాలు,స్వీట్స్‌, పండ్ల దుకాణాలు కిటకిటలాడాయి. వివిధ ఆకారాల్లో కేక్‌లను విక్రయించారు. మద్యం దుకాణాల్లోనూ జోరుగా విక్రయాలు సాగాయి. మరో వైపు కొత్త సంవత్సరం తొలిరోజు అన్ని వర్గాల ప్రజలు, రాజ కీయ నాయకులు, ఉద్యోగులు, అధికారులు, విద్యా ర్థులు శుభాకాంక్షలు తెలియజేసేందుకు సిద్ధమ య్యారు. ఇందుకోసం మార్కెట్‌లో బొకేలు, పండ్లు, స్వీట్లు, మొక్కలు, గ్రీటింగ్‌లు విరివిగా కొనుగోలు చేశారు. దీంతో ఆయా షాపులు రద్దీగా మారాయి. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు సాగాయి. క్రిస్టియన్లు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహా రా కాశారు. మొత్తంగా సిక్కోలు వాసుల్లో నూతన జోష్‌ నెలకొంది.

ప్రజాప్రతినిధులు, అధికారుల శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాం క్షలను జిల్లా ప్రజాప్రతి నిధులు, అధికారులు తెలిపారు. ప్రజలందరి తోడ్పాటుతో కొత్త సంవత్స రంలో మరిన్ని అద్భుతాలు ఆవిష్కరిద్దామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేశామని, ఈ కొత్త ఏడాదిలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కొత్త ఏడాది మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తు న్నామని ఎస్పీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ప్రజల లక్ష్యాలు.. వారి ఆకాంక్షలు నెరవేరాలని తాము కోరుతున్నట్లు పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌, ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, నడుకుదిటి ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, విజయనగరం పార్లమెంట్‌ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ప్రకటనల ద్వారా తెలిపారు.

Updated Date - Dec 31 , 2025 | 11:44 PM