Share News

‘నంబాళ్ల’ కుటుంబానికి న్యూడెమోక్రసీ బృందం పరామర్శ

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:25 PM

సీపీఐ మా వోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్య దర్శి నంబాళ్ల కేశవరావు కుటుంబ సభ్యు లను న్యూడెమోక్రసీ రాష్ట్ర ప్రతినిధులు శని వారం ఆయన స్వగ్రామం కోటబొమ్మాళి మం డలం జీయన్నపేటలో పరామర్శించారు.

‘నంబాళ్ల’ కుటుంబానికి న్యూడెమోక్రసీ బృందం పరామర్శ
కేశవరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న న్యూడెమోక్రసీ ప్రతినిధులు

టెక్కలి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): సీపీఐ మా వోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్య దర్శి నంబాళ్ల కేశవరావు కుటుంబ సభ్యు లను న్యూడెమోక్రసీ రాష్ట్ర ప్రతినిధులు శని వారం ఆయన స్వగ్రామం కోటబొమ్మాళి మం డలం జీయన్నపేటలో పరామర్శించారు. కేశ వరావు చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఆయన తల్లి సావిత్రమ్మను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్‌, శ్రీకా కుళం జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌, సహా య కార్యదర్శి వంకల మాధవ్‌ మాట్లా డుతూ.. కేశవరావును ప్రభుత్వం దారుణంగా హత్య చేసిందన్నారు. ప్రధాని మోదీ సర్కార్‌ సహజవనరులనుబహుళజాతి కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని విమ ర్శించారు. ఆయన తల్లితో మాట్లాడుతూ.. కన్నతల్లిగా మీ గర్భశోకం తీర్చలేనిదని, లక్ష లాది ఆదివాసీ తల్లులకు అంతకంటే ఎక్కువ శోకం మిగిల్చిందన్నారు. తన కొడుకు నేర స్తుడు కాదని, ఎన్నడూ ఎవరికీ అపకారం చేయలేదని, అయినా నేరస్తుడిగా చిత్రీకరించి తన కొడుకు శవాన్ని ఇవ్వక పోవడం అన్యా యమని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

Updated Date - Jun 07 , 2025 | 11:25 PM