చట్టం అమలులో నిర్లక్ష్యాన్ని సహించం
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:10 AM
collecter meeting లింగ నిర్ధారణ చట్టం అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అధికారులను, వైద్య సిబ్బందిని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు.
ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): లింగ నిర్ధారణ చట్టం అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అధికారులను, వైద్య సిబ్బందిని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో కీలక గణాంకాలు సమర్పించకపోవడంపై డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బందిపై అసం తృప్తి వ్యక్తం చేశారు. జూలై నుంచి నమోదైన గర్భిణులు, గర్భస్రావాల వివరా లను సమీక్షించారు. ‘ఎల్.ఎన్.పేట పీహెచ్‌సీలో 11శాతం, బొంతుపేట పీహెచ్‌సీ లో 10శాతం గర్భస్రావాలు నమోదయ్యాయి. ఇది జాతీయ సగటు కంటే అధి కంగా ఉంది. ఇక్కడ ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేయాలి. స్కానింగ్ కేంద్రాల తనిఖీలను మరింత కఠినతరం చేయాలి. జిల్లాలో మొత్తం 130 స్కానింగ్ మెషీన్లు(ప్రైవేటు-101, ప్రభుత్వ -29) ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉన్నా, క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల’ని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, ఏఎస్పీ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ డా.అనిత, కమిటీ కన్వీనర్ డా.శ్రీకాంత్, డీఐఓ డా.రాందాసు, డీసీహెచ్‌ఎస్ డా.కళ్యాణబాబు, డా.దానేటి.శ్రీధర్, బెజ్జిపురం యూత్‌క్లబ్ ప్రసాదరావు, మంత్రి వెంకటస్వామి పాల్గొన్నారు.