Share News

వృద్ధులపై నిర్లక్ష్యం తగదు

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:22 PM

వృద్ధుల పై నిర్లక్ష్యం తగదని, వారిని గౌరవించడం మనందరి బాధ్యత అని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు.

వృద్ధులపై నిర్లక్ష్యం తగదు
టెక్కలి: మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి నిర్మల

టెక్కలి సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి నిర్మల

టెక్కలి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): వృద్ధుల పై నిర్లక్ష్యం తగదని, వారిని గౌరవించడం మనందరి బాధ్యత అని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు. ఆదివారం కోర్టు సముదాయంలో న్యాయ విజ్ఞాన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు నిరాదరణకు గురిచేస్తే భరణంపై కేసు వేయ వచ్చన్నారు. వృద్ధులను వేధించడం, దూషిం చడం చట్టరిత్యా నేరమని పేర్కొంటూ వారి హక్కులను వివరించారు. వృద్ధులకు సమస్య లుంటే కోర్టు పరిధిలో న్యాయసేవాధికార సంస్థలో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమం లో చంద్రశేఖర్‌ పట్నాయక్‌, మధుబాబు, బొడ్డ అయ్యబాబు, ధవళ కృష్ణారావు, రాం బాబు, చిట్టెన్న, హరిశ్చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

వయో వృద్ధులను మర్యాదగా చూడండి

పలాస, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): తల్లి దండ్రులు, వయోవృద్ధులను మర్యాదగా చూ డాలని పలాస జూనియర్‌ సివిల్‌ న్యాయాధి కారి యు.మాధురి అన్నారు. ఆదివారం స్థాని క కోసంగిపురం లలితా చారిటబుల్‌ ట్రస్టు కార్యాలయంలో వయో వృద్ధులు, మానసిక వ్యాధిగ్రస్థులకు ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆధార్‌ కార్డులు మండల న్యాయ సేవాధికార సం ఘం ద్వారా అందించనున్నామన్నారు. వృద్ధు లను ఆదరిస్తున్న ట్రస్టు నిర్వాహకుడు ఎస్‌. చిన్నికృష్ణను అభినందించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు బీకేఆర్‌ పట్నాయక్‌, ఏజీపీ పిండి వెంకటరావు, జాయింట్‌ సెక్రటరీ జీఎంఎస్‌ అనిల్‌రాజు, కె. దేవరాజు, రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మన్మఽథరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:22 PM